. కాకినాడ నగరంలో స్థానిక దేవాలయం వీధిలో వేంచేసియున్న శ్రీబాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు,ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.దానిలో భాగంగా అన్నీ దేవాలయాలకు నూతన పాలక వర్గాలను ఏర్పాటు చేయడం