ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన లారీ క్లీనర్ సూరిబాబు బొగ్గులోడు లారీలో ఆదివారం బీహార్ కు బయలుదేరారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి చెక్ పోస్ట్ వద్ద లారీ పేపర్లు చెక్ చేయించుకోవడానికి దిగారు. పని పూర్తయిన తర్వాత రోడ్డు దాటుతుండగా రాజమండ్రి వైపు వెళ్లే కారు ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సూరిబాబు ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.