బందరు కలెక్టరేట్లో బార్ల లైసెన్సులకు లక్కీ డ్రా: జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కృష్ణా జిల్లాలో కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్ లైసెన్సులఎంపిక ప్రక్రియ శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 43 బార్లకు గానూ, 26 జనరల్ కేటగిరీ, 4 గీత కార్మికుల కేటగిరీ బార్లను డ్రా ద్వారా ఎంపిక చేశారు. మరో 13 బార్లకు వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో తిరిగి నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు తెలిపారు.