నగరపాలక పరిధిలో చేపడుతున్న "ఎన్టీఆర్ మన ఇల్లు" గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జ్ కమిషనర్, ఎంఈ వెంకటరామి రెడ్డి హౌసింగ్ అధికారులు, అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో హౌసింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక పరిధిలోని హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.