ప్రజాసేవా కార్యక్రమాల నడుమ ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యం ఇస్తూ పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు ఆదివారం అయ్యప్ప దీక్షను స్వీకరించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి అయ్యప్ప మాలను ధరింపజేశారు. ఈ సందర్భంగా యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ కూడా అయ్యప్ప మాలను ధరించారు.