నిర్మల్ జిల్లాకేంద్రంలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచింది. దీంతో గురువారం ఉదయం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. డాక్టర్ లైన్ రోడ్డు వద్ద మురుగునీరు పూర్తిగా నిలవడంతో జేసీబీ సాయంతో నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రాంతంలో వర్షపు నీరు నిలిస్తే సమాచారం ఇవ్వాలని శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ దేవిదాస్ సూచించారు.