తిరుపతి జిల్లా వెంకటగిరిలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ చిరస్మరణీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో YCP నాయకులు కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.