అమ్మాయిలను సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు పెట్టి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ డిఎస్పి వెంకటరెడ్డి హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డి.ఎస్.పి కార్యాలయంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. సోషల్ మీడియాలో మరియు లోన్ యాప్స్ లలో ఎవరినైనా వేధిస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.