కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని తాడిపత్రి రోడ్డు లోని మోరగుడి సర్కిల్ నుండి పెద్దపసుపుల మోటు వరకు గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది పారిశుద్ధ్య చర్యలను ముమ్మరంగా చేపట్టారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ వెంకట రామిరెడ్డి ప్రకటనలో పలు విషయాలు తెలిపారు.రోడ్డుకు ఇరువైపులా వున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని చాలాసార్లు ప్రజలకు తెలియజేయడమైనదని అన్నారు. కానీ ఎవరు స్పందించలేదన్నారు.