తెలకపల్లి మండల పరిధిలోని గోలగుండం గ్రామ శివారులో ఆటో కారు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్యాసింజర్ ఆటోలో వ్యవసాయ కూలీలతో పాటు విద్యార్థులను ఎక్కించుకొని తెలకపల్లి వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటో పంట పొలాల్లో పల్టీ కొట్టింది ఘటనలో సుమారు పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.