కేజీహెచ్ లో ఓ మహిళ డాక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళ డాక్టర్ 10 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దీంతో వార్డ్ బాయ్ శంకర్ రావు ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. శుక్రవారం కూడా ఊ రోగి పట్ల వార్డుపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం అందటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా కేజీహెచ్ లో వార్డ్ బాయ్ లు గా పని చేస్తున్న ఎంతోమంది రోగులపట్ల గురుసుగా ప్రవర్తిస్తూ వారి వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రోగులు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.