శ్రీకాకుళం జిల్లా గార మండలం అపోలు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొల్లి అప్పారావు (అందుడు) గత కొంతకాలంగా పెన్షన్ అందుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం ఇటీవల అనర్హత కలిగిన పెన్షన్లను ఏరువేతలో భాగంగా దివ్యాంగులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అప్పారావు తన భార్య లలిత, కుమార్తె దివ్య (17) శనివారం రాత్రి భోజనంలో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య భర్తలు మృతి చెందగా... కుమార్తె దివ్య జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఘటనపై ఆదివారం ఉదయం గంటలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.