ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కాకుండా అర్హులకు ఇవ్వాలని BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాంకిడి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం నాటికి నిరహార దీక్ష 3వ రోజుకు చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగినప్పటికీ కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కమిటి సభ్యులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఆయన ఆరోపించారు.