పెనుకొండ నియోజవర్గంలో పెత్తందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యక్తి పరిటాల రవి అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. పరిటాల రవి గురించి గుర్తు చేసుకునేలా పెనుకొండలో పరిటాల రవి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పరిటాల రవి తనకు తోడుగా లేకున్నా పెనుకొండ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. మంత్రి సవితకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.