కందుకూరు సహకార సంఘాల వద్ద యూరియా కోసం బారులు తిరిగిన రైతులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా సరఫరా లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. పోలీసులు ఆధార్ కార్డ్ పాస్బుక్ ఆధారంగా టోకెన్లు ఇచ్చి యూరియా సరఫరా చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రైతులకు సరిపడ యూరియాను అందించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.