పల్నాడు జిల్లా,దాచేపల్లిలో ఆదివారం జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. సీనియర్ కరాటే మాస్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు.