గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు.బుధవారం హైదరాబాద్ CCLA కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కలెక్టరేట్ లోని విసి హాల్ నుండి అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఈ వీసీ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేష్ కుమార్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు.