బెంగళూరు జాతీయ రహదారి కర్నూలు శివార్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని స్థానిక చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే ప్రక్కన పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి వదిలేయడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆర్థిక ఇబ్బందుల వల్ల బలవన్ మరణం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని కంటనీరు పెట్టుకున్నారు.గుత్తి రోడ్డు ఫ్లైఓవర్ నుండి రెండు కిలోమీటర్ల మేర పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు కే. నాగశేషుడు, పి.ఎల్. కాంతారెడ్డి, ఫాజిల్ అహ్మద్‌తో పాటు సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ– “కోట్లాది రూపాయల టోల్ రుసుములు వసూలు చేసుకుంటూ హైవ