ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల నిద్రకు అరుగులే చాపలు పాసుబుక్కులు దిండులయ్యాయి. వానకాలం పంటల సాగు అంచనాలు దాటగా ఫైర్లకు యూరియా అందాల్సిన కీలకమైన సమయంలో లభ్యత లేక పంపిణీ కేంద్రాల ముందు రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం రాత్రి బస్తా యూరియా కోసం తుంగతుర్తిలో రైతులు నిద్ర మానుకొని రాత్రంతా సొసైటీ కార్యాలయం వద్ద చలిమంటలు వేసుకొని జాగారం చేసిన వీడియో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఒక్క బస్తా యూరియా కోసం రైతన్నలు పడుతున్న ఆరాటం వేదన గుండెలను ప్రతి ఒక్కరిని పిండి వేస్తుంది.