కడప జిల్లా పులివెందులలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రయాణికురాలు బస్సులోంచి కిందపడింది. స్థానిక పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఓ యువతి బస్సులోంచి జారీ పడింది. త్రుటిలో పేను ప్రమాదం తప్పడంతో ఆ యువతి ఊపిరి పీల్చుకుంది. ప్రయాణికురాలు దిగే సమయంలో చూసుకొని డ్రైవర్ ముందుకు బస్సును కదిలించడంతో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యం మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.