శ్రీ సత్య సాయి జిల్లా బుకపట్నంలోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం ప్రిన్సిపల్ మక్బూల్ హుస్సేన్ అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో సువర్ణ పాల్గొని ప్రసంగించారు. భాషలందు తెలుగు భాష లెస్స అని తెలుగు మాధుర్యం ఏ భాషకు లేదని తెలిపారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.