గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం లోని బొండపల్లి అంబటి వలస గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు ప్రజలకు అందుతాయి అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా పరిపాలన సాగిస్తోందని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమాల్లో గజపతినగరంఏ ఏం సి చైర్మన్ పి వి వి గోపాలరాజు, వైస్ చైర్మన్ కోరాడ కృష్ణ, అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.