ఉత్తర తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో రానున్న గోదావరి పుష్కరాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పుష్కరాల నిర్వహణపై, ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం రోజున మధ్యాహ్నం, ధర్మపురిలో పర్యటించారు. గోదావరి నది తీరంలో ఉన్న ఘాట్లను జిల్లా స్థాయి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. రానున్న గోదావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు ధర్మపురికి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు