తిరుపతి జిల్లా, వెంకటగిరి పట్టణంలో 156 వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తూర్పు వీధిలోని కలివేలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తూర్పు వీధిలో మాట్లాడుతూ గాంధీజీ సంకల్పాన్ని పాటించేది కూటమి ప్రభుత్వం అని తెలిపారు. 2014లో నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అది కేవలం గాంధీజీ సంకల్పంతో మోడీ చేశారని చెప్పారు. ఆయన సంకల్పంతో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకొని ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని ఆలోచనతో మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారన