మెట్ పల్లి: ఏబీవీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్ పల్లి శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ మాడవేని సునీల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మెట్పల్లి నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగర నూతన కార్యదర్శిగా కలికోట ప్రణీత్, నగర సంయుక్త కార్యదర్శిగా ఆర్ఎస్ సాయికుమార్ ఎన్నికయ్యారు. మారుతి తదితరులు పాల్గొన్నారు.