ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న గుంటూరు పల్లి గ్రామానికి చెందిన బానోతు స్వప్న అనే మహిళ భర్త వివాహేతర సంబంధం పెట్టుకోని వేదించడం వల్ల నేడు మంగళవారం రోజున మృతి చెందింది. బానోతు మొగిలి అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోకుండా సహజీవనం పేరుతో ఆమెతో ఉంటున్నాడు. అతనికి ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు అయి ముగ్గురు సంతానం కూడా కలరు. దాదాపు రెండు సంవత్సరాల నుండి మృతురాలి యొక్క భర్త అయిన రాజమౌళి మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, ఇట్టి విషయం తెలిసి మృతురాలు స్వప్న అతడిని మందలించడంతో అప్పటినుండి రాజమౌళి ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు కొడుతూ మృతురాలని వేధిస్తున్నాడు,