Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని పాచిపెంట మండలంలో ఉన్న పెద్దగెడ్డ జలాశయంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన గిరిజన మత్స్యకారుడి ఆచూకీ శుక్రవారం కూడా లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్ డి ఆర్ ఎఫ్NDRF బృంద సభ్యులు మరబోట్లలో పెద్దగెడ్డ జలాశయంలో బృందాలుగా ఏర్పడి, తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పాచిపెంట మండలంలోని కోడికాళ్ళవలస గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారుడు జన్ని బాలరాజు గురువారం తెప్పలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడని అతని కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.