కడప జీల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరంలో వెలుగు కార్యాలయం లో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నేడు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీవో రామచంద్ర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాల జిరాక్స్లతో హాజరయ్యారు. అభ్యర్థులకు ఉద్యోగ వివరాలు, శిక్షణ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.