ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు సోమవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. దశలవారీగా మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు క