ప్రజల జన హృదయ నేతగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోతారని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 12 గంటలు వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలులోని YSR విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు