సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప రామాలయ ప్రాంగణంలో ఉన్న ఆలయాలన్నీ ఆదివారం మూసి వేశారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఆలయాలు తెరిచి ఉంటే.. గర్భగుడిలో ఉన్న దేవతా మూర్తులు యొక్క విగ్రహాల యొక్క శక్తి సన్నగిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరసుకుంటాయని అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తామని పురోహితులు తెలిపారు.