శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి భక్తులు శనివారం మధ్యాహ్నం వినాయక చవితి పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల బాలికలు భక్తిశ్రద్ధలతో సత్యసాయి కీర్తనలు ఆలపించారు. బాలికలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం సత్య సాయి ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు సత్య సాయి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశీ భక్తులు పాల్గొన్నారు.