అఖిల భారతీయ రాష్ట్రీయ సాక్షానిక్ మహాసంగ్ ఆధ్వర్యంలో నేడు దేశ వ్యాప్తంగా సుమారు 5 లక్షల పాఠశాలలో ఆ పాఠశాల మన ఆత్మగౌరవం పేరుతో ప్రతిజ్ఞ నిర్వహించాలని లక్ష్యంతో కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తగాడి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జైలు పల్లి పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. పాఠశాలను పరిశుభ్రంగా క్రమశిక్షణతో ఆకుపచ్చగా స్ఫూర్తిదాయకంగా ఉంచుతామని ప్రతిజ్ఞలో తెలిపారు.