కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 12 గంటలకు ఉల్లికీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉల్లి క్వింటానికి 2వేల నుండి 3 వేల దాకా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉల్లిని అమ్ముకుందామని మార్కెట్కు వస్తే క్వింటం 200 నుండి 500 దాకా కొనుగోలు చేయడం దారుణమని వారు మండిపడుతున్నారు. తక్షణమే ఉల్లి రైతన్న ఆదుకోవాలని డిమాండ్ చేశారు.