కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, కాసాల బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింలు పాల్గొన్నారు.