కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జీఎస్టీ భారీగా తగ్గించడంతో నేడు శుక్రవారం పరిగి పట్టణంలో పట్టణ బిజెపి అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జిఎస్టి తగ్గించడంతో పలు రకాల వస్తువుల ధరలు తగ్గుతాయని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీపావళి, దసరా కానుకగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. చిరు వ్యాపారులకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వచ