ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సిఐ రానా ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం తలోడి గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 5గురినీ పట్టుకొని వారి వద్ద నుంచి రూ.10,980 నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.