Araku Valley, Alluri Sitharama Raju | Aug 12, 2025
గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని అల్లూరి జిల్లా ఏఎస్పీ కె.ధీరజ్ సూచించారు. మంగళవారం సాయంత్రం అరకులోయ ఆస్ఐటీఐలో "సే నో టూ గంజా"పై విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. గంజాయి, సారా, గుట్కా వలన జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. గంజాయి సాగు, వినియోగం, రవాణా నేరమని, కఠిన శిక్షలు ఉంటాయని ఏఎస్పీ హెచ్చరించారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు,ప్రిన్సిపల్ ఉమాశంకర్ పాల్గొన్నారు