రైతు సమస్యలపై కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం తలపెట్టిన అన్నదాత పోరు ర్యాలీకి రైతులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు లోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.