రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకమైన నాయకత్వం యువతకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన, టిడిపి నాయకులతో కలిసి పుట్టినరోజు కేకును మంత్రి కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో అపారమైన స్థానాన్ని సంపాదించారన్నారు.