బీసీలకు 42 % స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లను అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన సందర్భంగ ఖానాపూర్ లో కాంగ్రెస్ శ్రేణులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బీసీ సామాజిక వర్గం తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.