నాగలాపురంలో తెలుగు భాషా దినోత్సవ ర్యాలీ నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. HM కస్తూరయ్య గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహార భాషకు చేసిన సేవలు, హాకీ క్రీడాకారుడు ధాన్య చంద్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.