నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పని ముగించుకుని ఇంటికి వస్తున్న గర్నెపూడి రేబా అనే వ్యక్తిని క్రేన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.