సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ వద్ద అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జాడిమల్కాపూర్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన పాండు చౌహన్ అనే వ్యక్తి గుడుంబా తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. అతని వద్ద తొమ్మిది లీటర్ల గుడుంబా తో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.