గత కొన్ని రోజులకు కురుస్తున్న భారీ వర్షాల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నాలుగు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు నీటిని మరిగించి వడపోసి తాగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా వైరల్ జ్వరాలు ఎక్కువ వ్యాప్తి చెంది అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.