ఈనెల 27 నుండి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు పెనగలూరు మండలంలో పలు ఆలయాలు ఆదివారం నాటికి ముస్తాబయ్యాయి. పెనగలూరు పంచాయతీ పరిధి లోని ఇండ్లూరు సిద్ధి వినాయక స్వామి దేవాలయం, పి. కొత్తపల్లి కార్య సిద్ధి వినాయక స్వామి దేవాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యద్భుతంగా అలంకరించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, అల్పాహార ప్రసాదం పంపిణీ లతో పాటు లడ్డు ప్రసాదం సమర్పణ, గ్రామ్మోత్సత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించునున్నారు.