ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా రాజంపేట నడిబొడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేటను జిల్లా చేస్తామని, అన్నమయ్య ప్రాజెక్ట్ ను పునః నిర్మిస్తామని, మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, పందికాళ్ళ మణి కోరారు. ఈసందర్భంగా గురువారం రాజంపేట స్థానిక R&B బంగ్లా నందు విలేఖర్ల సమావేశంలో రవికుమార్, మణి మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోవడం వల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి తాగునీటికి కూడా ఇబ్బందులు