యాదాద్రి భువనగిరి జిల్లా : రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి జిల్లా నాయకులు, సింగిల్విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరచారి విమర్శించారు. సోమవారం రామన్నపేట తహసిల్దార్ కార్యాలయం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుందని అయినా రైతు సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం జరిగిందని, పిఎసిఎస్ కార్యాలయాల వద్ద రైతులు యూరియా కోసం చిన్నపిల్లలతో వచ్చి క్యూలైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.