ధర్మాజీపేట్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు బురద మాయమైన రోడ్డుపై శుక్రవారం నిరసన తెలిపారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన తమ గ్రామానికి రోడ్డు లేక నిత్యం ప్రమాదాల అంచున ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డంతా గుంతల మయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురైనా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి గ్రామస్తుల ప్రధాన సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.