Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు బీజేవైఎం కళాశాల రాష్ట్ర విభాగం కన్వీనర్ మంద మహేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీహార్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ భారత దేశ ప్రధాని మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మ దానం చేసినట్లు తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిని గౌరవించే విధానం ఉన్నప్పటికీ ,రాహుల్ గాంధీ అసభ్యకర మాటలు మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి బీజేవైఎం డిమాండ్ చేస్తుందన్నారు.